పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : విరహార్తలగు గోపభామినులు ఉద్ధవునిఁ జూచి పలుకుట

v

రి నిన్నుఁ బుత్తేర రుదెంచి యంత
యశోదకును నవ్వార్తలుఁ జెప్పి
యూకె పోవేల? గిమమ్ముఁ జూచి
చేరి స్వామిహితంబుఁ జెప్పెదుగాక
ట నింక నెనరువారెవ్వరు గలరు? 
కటా మమ్మేల మలాక్షుఁ డడుగు? 
డిగెడివాఁడైన రుదేఁడె యిట్లు
విడుచునే మమ్ము నీవిరహాగ్నినడుమ?” 
నిపల్కి కృష్ణుని యంగంబు సొబగుఁ 
నుబారులీలలు, నువుచిత్తమునఁ 
గ్రొత్తైన విరహాగ్ని గురుసులు వార
త్తలోదరులు సిగ్గరి యాడిపాడి
యొయింతి కుసుమగుచ్ఛోద్ధూతమధువుఁ 
బ్రటితంబుగఁ గ్రోలి పాడుచునున్న
ధుపంబుఁ జూపి నెమ్మది మాటువెట్టి
ధురగర్వోక్తి నున్మాదియైపలికె.   - 380